Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కన్నప్ప'లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్!

Kannappa movie update
Advertisement
  • మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న 'కన్నప్ప'
  • విష్ణు సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న సినిమా
  • ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న ప్రభాస్  
  • ప్రత్యేక పాత్రల్లో మెరవనున్న ఇతర భాషల్లోని స్టార్ హీరోలు
Advertisement
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' రోజురోజుకూ స్థాయిని పెంచుకుంటూపోతోంది. 'కన్నప్ప' నుంచి వస్తోన్న అప్ డేట్లతో పాన్ ఇండియా వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. 'కన్నప్ప' చిత్రం మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా దృష్టి పడింది. రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ 'కన్నప్ప' సినిమాలో భాగమయ్యారు. ఈ సినిమాలో వారు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు.

తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ‘కన్నప్ప’ జర్నీలోకి వచ్చారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరో ముఖ్య పాత్రలో శివ రాజ్‌కుమార్ కనిపించబోతోన్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. శివ రాజ్‌కుమార్ పాత్రకు సంబంధించిన అప్ డేట్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. ఇలా ప్రతీ ఇండస్ట్రీలోని సూపర్ స్టార్ 'కన్నప్ప'లో భాగస్వామి అవుతుండటంతో అందరి ఫోకస్ ఈ మూవీపైనే ఉంది.బుల్లితెరపై 'మహాభారతం' సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ 'కన్నప్ప' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ భక్తుడైన 'కన్నప్ప' కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో 'కన్నప్ప'గా మంచు విష్ణు కనిపించబోతోన్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి రచయితలు పనిచేశారు.
Advertisement
Advertisement
Manchu Vishnu
Prabhas
Mohanlal
Shivaraj Kumar

More Telugu News